నల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ యార్డ్ దగ్గర ​బైకులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. 

అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. మృతులను వాడపల్లికి చెందిన బత్తుల ధనుంజయరావు, నరసింహారావు.. దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన డెక్క వెంకటేష్‎గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.