బషీర్బాగ్, వెలుగు: సిటీ వాసులు తమ ఇంటి పైకప్పులు, బాల్కనీలు, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకునేలా ఉద్యానశాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు.
తక్కువ స్థలంలో సాగు చేసే విధానం, గ్రో బ్యాగులు, కుండీల వినియోగం, సేంద్రియ ఎరువుల తయారీ, పురుగుమందుల నియంత్రణతో పాటు టమాటా, మిరప, కరివేపాకు, పాలకూర వంటి పంటల సాగుపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 8977714411 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.
