ఒంటరి మహిళలకు రైల్లో స్పెషల్ సీట్లు ఉన్నాయా.. ఈ విషయం ఎంత మందికి తెలుసు..!

ఒంటరి మహిళలకు రైల్లో స్పెషల్ సీట్లు ఉన్నాయా.. ఈ విషయం ఎంత మందికి తెలుసు..!

భారతీయ రైల్వేలో ప్రయాణించడం అంటేనే ఒక మంచి అనుభవం. రోజూ కోట్లాది మంది ప్రయాణించే ఈ రైళ్లలో... ముఖ్యంగా మహిళల భద్రత, సౌకర్యం కోసం రైల్వే శాఖ కొన్ని చర్యలు తీసుకుంది, చాలా మందికి తెలియని రూల్స్‌ను కూడా అమలు చేస్తోంది. అవేంటంటే...ఉదాహరణకు లేడీస్ కోచ్‌లు ఇంకా రిజర్వ్డ్ సీట్లు. అయితే, టిక్కెట్ బుకింగ్ సిస్టమ్‌లో ఒంటరి మహిళల కోసం ఒక చాలా ప్రత్యేకమైన ఫీచర్ ఉందని, దాని గురించి చాలా మంది ప్రయాణికులకు ఇప్పటికీ తెలియదని మీకు తెలుసా...?

 ఒంటరి మహిళలకు 
మీరు ఎప్పుడైనా గమనించారా ? ఒక మహిళ  తోడు లేకుండా ఒంటరిగా  IRCTC ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, సిస్టమ్ ఆమె భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.

ఒక క్యాబిన్ లేదా కంపార్ట్‌మెంట్‌లో 6 సీట్లు ఉన్నాయనుకుందాం. అందులో ఇప్పటికే 5 సీట్లు పురుషులు బుక్ చేసుకున్నారు అనుకోండి... ఆరవ సీటు ఖాళీగా ఉన్న, ఆరో సీటును ఏమాత్రం ఒంటరి మహిళకు కేటాయించరు!

రైల్వే సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడిందంటే... ఆ కంపార్ట్‌మెంట్‌లో కనీసం ఒక మహిళా ప్రయాణికురాలు ఇప్పటికే ఉంటేనే, ఆ ఒంటరి మహిళకు సీటు అలాట్ అవుతుంది. అంటే పురుషులు మాత్రమే ఉన్న కంపార్ట్‌మెంట్‌లో ఒంటరి మహిళకు సీటు కేటాయించకుండా  ఈ ఆటోమేటిక్ సిస్టమ్ భద్రతా వలయంలా ఉంటుంది.

 45 ఏళ్లు దాటితే...  
భద్రతతో పాటు మహిళల శారీరక సౌకర్యాన్ని కూడా రైల్వే ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటుంది.

రైళ్లలో ప్రయాణించే మహిళ వయస్సు 45 సంవత్సరాలు దాటితే, టికెట్ బుకింగ్ సమయంలో వారికి లోవర్ బెర్త్ (Lower Berth) దక్కేలా సిస్టమ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రూల్ సీనియర్ సిటిజన్లు ఇంకా దివ్యాంగులకు కూడా వర్తిస్తుంది.

ఒకవేళ అప్పుడప్పుడు సిస్టమ్ లోపం వల్ల లేదా రద్దీ కారణంగా పొరపాటున పై బెర్త్ (Upper Berth) కేటాయిస్తే... మహిళలు టెన్షన్ పడాల్సిన పనే లేదు ! ట్రైన్ ఎక్కిన తర్వాత నేరుగా TTE తో మాట్లాడి, కింది బెర్త్ కి మార్చుకోవచ్చు.

సాధారణ ప్రయాణికులకు పెద్దగా తెలియని ఈ రూల్స్ మహిళల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ప్రశాంతంగా మారుస్తున్నాయి.