ఎంబపేకు రూ.2 వేల 700 కోట్ల ఆఫర్‌‌‌‌

ఎంబపేకు రూ.2 వేల 700 కోట్ల ఆఫర్‌‌‌‌

సిడ్నీ: ఫ్రాన్స్‌‌‌‌ సాకర్‌‌‌‌ స్టార్ కిలియన్‌‌‌‌ ఎంబపేను తమ టీమ్‌‌‌‌లోకి తీసుకునేందుకు  సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ క్లబ్‌‌‌‌ అల్-హిలాల్ సోమవారం  రికార్డు స్థాయిలో రూ. 2700 కోట్ల  (332 మిలియన్ యూఎస్​ డాలర్లు)  బిడ్‌‌‌‌ వేసింది. 

ఈ  విషయాన్ని ప్రస్తుతం ఎంబపే ఆడుతున్న పారిస్‌‌‌‌ సెయింట్‌‌‌‌-–జర్మైన్‌‌‌‌ (పీఎస్‌‌‌‌జీ) టీమ్ కన్ఫామ్‌‌‌‌ చేసింది. ఎంబపేతో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతిచ్చింది.  ఈ ఆఫర్‌‌‌‌కు ఎంబపే ఓకే చెబితే సాకర్‌‌‌‌ హిస్టరీలో అతను అత్యంత ఖరీదైన ప్లేయర్‌‌‌‌ కానున్నాడు. 

2017లో 262 మిలియన్‌‌‌‌ డాలర్ల ఒప్పందంతో  బార్సిలోనా నుంచి పీఎస్‌‌‌‌జీకి మారిన బ్రెజిల్‌‌‌‌ స్టార్‌‌‌‌ నెయ్‌‌‌‌మార్‌‌‌‌ రికార్డును ఎంబపే బ్రేక్‌‌‌‌ చేయనున్నాడు.