ATM లు ఎలా వాడాలంటే

ATM లు ఎలా వాడాలంటే

ఏటీఎం.. ఈ పేరు తెలియని వారుండరు. ఎవరికి డబ్బులు కావాలన్నా.. మొదట వెళ్లేది అక్కడికే. ఏటీఎంలు వచ్చాక మనలో చాలా మంది జీవితాలు చాలా సులభతరమయ్యాయి. దానికి తోడు గల్లీకో ఏటీఎం ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటిలో కొన్ని పనిచేయకపోయినా.. ప్రస్తుతం మాత్రం పరిస్థితి చక్కబడింది. బ్యాంక్‌‌లకు వెళ్లి గంటల తరబడి వేచి చూసే బాధ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ మన చేతిలోకి వచ్చేస్తాయి. దాని కోసం కొన్ని  పద్ధతులు ఫాలో అయితే చాలు. అయితే ఈ పద్ధతులపై పూర్తి అవగాహన లేకపోతే, మన డబ్బులు కూడా అలానే గోవింద అవుతాయి.  ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే, మూడు విషయాలు మాత్రం తప్పకుండా మనం  తెలుసుకోవాలి. అవేమిటో ఓసారి చూద్దాం…

ఏటీఎంలు మళ్లీ క్యాష్ వెనక్కి తీసుకోవు…

అంతకుముందు ఏటీఎంలలో క్యాష్ రిట్రాక్షన్ సౌకర్యం ఉండేది. అంటే క్యాష్‌‌ను విత్‌‌డ్రా చేసిన తర్వాత, ఒక 15 సెకన్లలో ఆ క్యాష్‌‌ను మనం తీసుకోకపోతే.. వెంటనే వాటిని మెషిన్ వెనక్కి తీసుకుంటుంది. మళ్లీ అవి మన అకౌంట్‌‌లోకి క్రెడిట్ కూడా కావు. కానీ మోసాలు పెరిగిపోతుండటంతో, ఈ ఫెసిలిటీని 2012లో ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంక్‌‌లు తొలగించాయి. ఇప్పుడు మనం క్యాష్‌‌ను విత్‌‌డ్రా చేశాక, మెషిన్ వద్ద నుంచి తీసుకోకపోతే, మన తర్వాత వచ్చే వారు వాటిని తీసేసుకుంటారు. ఈ లాస్‌‌కు ఏటీఎం ఆపరేటర్‌‌, బ్యాంక్‌‌లు‌‌ ఎప్పటికీ బాధ్యులు కావు. అందుకే చాలా వరకు ఏటీఎంలు క్యాష్‌‌ను మెషిన్ నుంచి బయటికి పంపిణీ చేసేముందు, ప్రాసెస్ అయ్యే సౌండ్ పెద్దగా చేస్తాయి. దీంతో మనం అలర్ట్ అయి, క్యాష్ బయటికి రాగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాష్ తీసుకోకపోతే, అది మన తప్పే అవుతుంది.

లావాదేవీ చేస్తున్న మధ్యలోనే అంతరాయం..

ఒక్కోసారి మీరు పిన్ నెంబర్‌‌‌‌ను, అమౌంట్‌‌ను ఎంటర్ చేసి,  చేతిలోకి రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు, సడెన్‌‌గా ఏటీఎం స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. ఎర్రర్ మెసేజ్‌‌ చూపిస్తుంది. ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకండి. టెక్నికల్, ఎలక్ట్రికల్ సమస్యల వల్ల ఇలాంటి అంతరాయాలు ఏర్పడవచ్చు. దీనికి పూర్తి బాధ్యత మిషన్ ఆపరేటర్‌‌‌‌దే. ఒకవేళ లావాదేవీ పూర్తికాని సమయంలో ఇలా జరిగితే, ఏటీఎంలే తమంతట తాము ఆ లావాదేవీని క్యాన్సిల్ చేసి, మీ మనీని అకౌంట్‌‌లోకి క్రెడిట్ చేస్తాయి. ఒకవేళ క్యాష్‌‌ బయటకు రాకుండా.. మీ అకౌంట్‌‌లోంచి డబ్బులు డెబిట్ అయితే, మీ బ్యాంక్‌‌ స్టేట్‌‌మెంట్‌‌లో ఆ లావాదేవీని నోట్‌‌ చేసుకుని, సంబంధిత బ్యాంక్‌‌ను సంప్రదించాలి. అక్కడ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌‌మ్యాన్‌‌ వద్ద మీ ఫిర్యాదును దాఖలు చేయొచ్చు.

కార్డు డ్యామేజ్ కాకుండా…

మనలో చాలా మంది ఇచ్చే కంప్లయింట్ పాత ఏటీఎం మెషిన్ల వల్ల కార్డులు పాడైపోతున్నాయని. ఏటీఎం మెషిన్లను రికాబిలేటెడ్ చేసిన తర్వాత నుంచి ఈ సమస్యలను బ్యాంక్‌‌లు చాలా వరకు తగ్గించుకుంటూ పోయాయి. ప్రస్తుతం చాలా వరకు డెబిట్ కార్డులను కూడా బ్యాంక్‌‌లు అప్‌‌గ్రేడ్ చేసి, చిప్‌‌ బేస్డ్‌‌తో తీసుకొచ్చాయి. మీరు ఏదైనా లావాదేవీ చేయాలంటే, ముందుగా కార్డును మెషిన్‌‌లోకి పెట్టాల్సి ఉంటుంది. ఆ లావాదేవీ అయిపోయేంత వరకు కార్డు మాత్రం బయటికి రాదు. కొంత మంది లావాదేవీ అయిందో లేదో తెలియకుండానే కార్డును రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో కార్డులు డ్యామేజ్ అవుతుంటాయి. ముఖ్యంగా చిప్‌‌ పోర్షన్‌‌లో ఈ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని నిరోధించడానికి కార్డు స్లాటులో రెడ్ ఎల్‌‌ఈడీ లైట్ వెలుగుతుంటే, కార్డును బయటికి తీయకూడదు. లావాదేవీ పూర్తయ్యాక ఎల్‌‌ఈడీ లైట్ గ్రీన్‌‌లోకి మారుతోంది. అప్పుడు మీ కార్డు సేఫ్‌‌గా తీసేసుకోవచ్చు.