జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి ఇండ్లు ధ్వంసం

జమ్మూ కశ్మీర్ లో  భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి ఇండ్లు ధ్వంసం

జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా నదులు, కాలువల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీని కారణంగా శ్రీనగర్-లేహ్ హైవేతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఇక, జోజిలా, సాధనా టాప్, రజ్దాన్ పాస్, దావర్ గురేజ్, తులైల్ గురేజ్, మచిల్, కొంగ్డోరి, మెయిన్ గుల్ మార్గ్, సింథాన్ టాప్, మొఘల్ రోడ్ లలో కూడా భారీగా మంచుకురుస్తోంది. మరోవైపు పలు పూంచ్ లోని పలు ప్రాంతాల్లో...కొండ చరియలు విరిగిపడి పలు ఇండ్లు నేలమట్టం అయ్యామి. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని...జనం భయంతో వణికిపోతున్నారు.  

మరోవైపు..అధిక ఉషోగ్రతల కారణంగా పలు ప్రాంతాల్లో మంచుకొండలు కరుగుతున్నాయి. నిల్ గ్రర్, బాల్టాల్ మధ్య సింధూ నదికి ప్రవహించే..కాలువల వరదకు మంచు అడ్డంకిగా మారుతోంది. దీంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తున్నారు సిబ్బంది. 

జమ్మూ కాశ్మీర్ లో రాబోయే కొన్ని రోజుల పాటు అధిక వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు, తీవ్రమైన వడగళ్ల వాన, బలమైన గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.  మే 1 వరకు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రయాణించవద్దని ప్రజలకు హెచ్చరించారు.