
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క సీటు నుంచి పోటీ చేయకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రియాంక అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో పోటీకి దూరంగా ఉంటూ పార్టీ తరుపున ప్రచారం చేయాలని ప్రియాంక ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్ల సభ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేదానిపై మరో 24 గంటల్లో క్లారిటీ రానుంది. అమేథీ నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తో్ంది.
Also Read:రిజర్వేషన్లపై విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక అమేథీ నుంచి బీజేపీ తమ అభ్యర్థిగా స్మృతి ఇరానీని ప్రకటించగా ఆమె నిన్న నామినేషన్ వేశారు. ఇక రాహుల్ గాంధీ గతంలో కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో మళ్లీ అక్కడినుంచే పోటీకి దిగారు.