శ్రీచైతన్య కాలేజీకి హెచ్ఆర్​సీ నోటీసులు

శ్రీచైతన్య కాలేజీకి హెచ్ఆర్​సీ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థల్లో పనిచేసే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా, ఎంప్లాయీస్​ను తొలగిస్తున్నారనే ఫిర్యాదుపై తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్​సీ) స్పందించింది. సెప్టెంబర్ 20న కమిషన్ ముందు హాజరుకావాలని హెచ్ఆర్​సీ సెక్రటరీ విద్యాధర్​భట్ శ్రీచైతన్య విద్యాసంస్థల జీఎంకు నోటీసులు జారీ చేశారు. అదే రోజు పూర్తి వివరాలతో విచారణకు రావాలని కళాశాల విద్యాశాఖ అధికారులకూ నోటీసులిచ్చారు. కార్పొరేట్ కాలేజీల్లో లెక్చరర్లను తొలగిస్తున్నారని, జీతాలివ్వడంలో జాప్యం చేస్తున్నారని గత నెల17న టీఎస్​టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్​కుమార్ ​హెచ్ఆర్​సీని ఆశ్రయించారు. స్టూడెంట్ల నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నా లెక్చరర్లకు మాత్రం జీతాలివ్వడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.