హైదరాబాద్, వెలుగు: నేషనల్ లోక్ అదాలత్‌లో భాగం రాష్ట్రంలో శనివారం అన్ని కోర్టుల్లో భారీ ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి. మొత్తం 3.60 లక్షల కేసులు పరిష్కారం కాగా.. సుమారు రూ. 168 కోట్ల మేర పరిహారం చెల్లింపులు జరిగాయని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 218 కేసులు పరిష్కారమయ్యాయని హైకోర్టు లీగల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం. శాంతివర్ధని చెప్పారు. రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ యతిరాజులు. జస్టిస్ జి శ్రీదేవిలతో కూడిన ధర్మాసనాలు కేసుల్ని పరిష్కరించాయి. సుమారు రూ. 12 కోట్ల పరిహారం చెల్లింపులు జరగగా..650 మందికి లబ్ధి చేకూరింది.

