భూ సేకరణలో వేగం పెంచాలి.. ప్రతి శుక్రవారం భూసేకరణకు సంబంధించి రివ్యూ మీటింగ్

 భూ సేకరణలో వేగం పెంచాలి.. ప్రతి శుక్రవారం భూసేకరణకు సంబంధించి రివ్యూ మీటింగ్

గద్వాల, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో భూసేకరణ పై సంబంధిత శాఖల ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

 సందర్భంగా వారు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్టు పథకానికి 541 ఎకరాల్లో గత 15 రోజుల్లో 56 ఎకరాలకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇచ్చారని, మిగిలిన భూసేకరణ కూడా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం భూసేకరణకు సంబంధించి రివ్యూ నిర్వహిస్తామని, ఎప్పటికప్పుడు పురోగతి సాధించి నివేదికలు సమర్పించాలని సూచించారు. 21న జరిగే నీట్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.