ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు: మంత్రి బాలినేని

V6 Velugu Posted on Sep 25, 2021

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని, వంద శాతం మార్పులు చేసే అవకాశం ఉండొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శనివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తానని సీఎం మొదట్లోనే ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం జగన్ ను కలసినప్పుడు మంత్రివర్గంలో వంద శాతం కొత్త వారిని తీసుకుంటామని చెబితే.. తాను శిరసా వహిస్తానని జవాబిచ్చానని అన్నారు. తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తానన్నారు. తనకు పార్టీయే ముఖ్యమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పస్టం చేశారు. 
 

Tagged VIjayawada, Amaravati, ongole, prakasham District, , ap updates, bejawada, ap cabinet reshuffle, complete new cabinet in ap, cm  jagan\\\'s view

Latest Videos

Subscribe Now

More News