ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ఆరు ఎక్సైజ్ స్టేషన్లలో నమోదైన 47 కేసులకు సంబంధించిన 953 కేజీల గంజాయిని కాల్చివేయాలని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం అధికారులు తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని ప్రభుత్వ అనుమతి పొందిన ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ఫైర్ ఇండస్ట్రీలో సోమవారం గంజాయిని కాల్చివేశారు. దహనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4.76 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
