భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీనాగుండా గ్రామ అడవుల్లో మావోయిస్టుల భారీ డంపు లభ్యమైంది. శనివారం డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టి డంపును గుర్తించారు. రెండు బీజీఎల్ లాంఛర్లు, రెండు బోర్ తుపాకులు, ఎయిర్ గన్, మూడు డైరక్షనల్ ఐఈఈడీలు, ఐదు కిలోల టిఫిన్ ఐఈఈడీ, 30 బీజీఎస్ బాంబులు, 26 బోర్ రౌండ్లు, కరెంట్ వైర్ బండల్, రెండు కిలోల గన్‌పౌడర్, నక్సల్స్ సాహిత్యం స్వాధీనం చేసుకుని కాంకేర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
