కూకట్ పల్లిలో భారీ చోరీ.. కళ్ళలో కారంపొడి చల్లి రూ. కోటి ఎత్తుకెళ్లారు.. ఏసీపీ ఆఫీసు పక్కనే...

కూకట్ పల్లిలో భారీ చోరీ.. కళ్ళలో కారంపొడి చల్లి రూ. కోటి ఎత్తుకెళ్లారు.. ఏసీపీ ఆఫీసు పక్కనే...

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో భారీ చోరీ జరిగింది. డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తి కంట్లో కారంపొడి చల్లి రూ. కోటి ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. మంగళవారం ( మార్చి 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కూకట్ పల్లిలో బైక్ పై రూ. కోటి తీసుకెళ్తున్న వ్యక్తుల కళ్ళలో కారంపొడి చల్లి నగదుతో పరారయ్యారు దుండగులు.ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు పోలీసులు. డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులను మూడు బైకులలో ఫాలో అయ్యారు దుండగులు. డబ్బులు కలెక్ట్ చేసుకొని కొన్ని మీటర్లు కూడా వెళ్లకుండానే దాడికి పాల్పడ్డారు దుండగులు. డబ్బులు తరలిస్తున్న వారిపై కారం చల్లి... బైక్ కింద పడిపోగానే డబ్బులు ఉన్న బాక్స్ తో పరారయ్యారు. కూకట్ పల్లి ఏసీపీ ఆఫీసు పక్కనే ఘటన జరగడం గమనార్హం.

ఇదిలా ఉండగా, డబ్బులు తీసుకుని వెళ్తున్నవారినే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి దగ్గర ఉన్న భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవసరానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన డబ్బు హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నారు పోలీసులు.