ఉప్పల్ టూ సికింద్రాబాద్ భారీ ట్రాఫిక్ జామ్.. నరకం చూస్తున్న వాహనదారులు

ఉప్పల్ టూ సికింద్రాబాద్  భారీ ట్రాఫిక్ జామ్.. నరకం చూస్తున్న వాహనదారులు

సికింద్రాబాద్ హబ్సిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హబ్సిగూడలోని ఓ రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో..ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో హబ్సిగూడ మెయిన్ రోడ్డు పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు, ఆఫీలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో పది నిమిషాల జర్నీకి గంటల కొద్దీసమయం వృద్ధా అవుతుందని వాహనదారులు వాపోతున్నారు. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ప్రధానంగా ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

హైదరాబాద్ హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లో ఆగస్టు 2వ తేదీ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. రెస్టారెంట్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.