న్యూఢిల్లీ: ముడి సరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తుల ధరలను కొద్దిగా పెంచనున్నట్లు సబ్బులు, షాంపూలు, వాషింగ్ పౌండర్లు అమ్మే ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ప్రకటించింది. వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తగా ఈ పెంపు ఉంటుందని కంపెనీ సీఈఓ ప్రియా నాయర్ వెల్లడించారు.
మార్చి త్రైమాసికంలో డిమాండ్ స్థిరంగా ఉందని ఆమె తెలిపారు. ఖర్చులు 10 శాతం మేర పెరిగినప్పటికీ హెచ్యూఎల్ ఇప్పటి వరకు కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే ధరలను పెంచిందని సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వివరించారు. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ ఉత్పత్తుల విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

