అర్హులైన జీవిత ఖైదీలను విడుదల చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య

అర్హులైన జీవిత ఖైదీలను విడుదల చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య
  • ప్రభుత్వానికి లేఖ రాసిన మానవ హక్కుల వేదిక

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అంబేద్కర్​జయంతి సందర్భంగా అర్హులైన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ మానవ హక్కుల వేదిక కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎస్. జీవన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య  గురువారం ప్రభుత్వానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆరుగురు మహిళలు సహా 102 మంది ఖైదీలను విడుదల చేయాలని సూచించారు. 

అర్హులైన వారి జాబితా ప్రస్తుతం సీఎం ఆఫీస్​లో పరిశీలనలో ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. తదుపరి జాబితాలోని ఖైదీలను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను వీలైనంత త్వరగా ప్రకటించాలని కోరారు.