వికారాబాద్, వెలుగు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చించోలికి చెందిన ఉప్పరి శ్రీకాంత్(37) ఏడాదిగా వికారాబాద్ మండలం సిద్ధులూర్ లోని విల్లాజియో వెంచర్లో మేస్త్రిగా పనిచేస్తున్నాడు. వెంచర్లోనే భార్య రేణుక, పిల్లలు సంజన, స్వాతి, బస్వరాజ్, రితీష్ తో కలిసి ఉంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా అంతా కలిసి సొంతూరుకు వెళ్లారు. అక్కడ మద్యం తాగిన శ్రీకాంత్ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య రేణుక తిరిగి సిద్ధులూర్రాలేదు. మనస్తా పం చెందిన శ్రీకాంత్ మద్యం మత్తులో మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
