- మంత్రి తుమ్మలను కోరిన జేఏసీ, హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం
హుజూరాబాద్, వెలుగు: వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ద్వారా హుజూరాబాద్ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని డంప్ యార్డ్ వ్యతిరేక జేఏసీ నాయకులు, హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జేఏసీ లీడర్లు, పాలకవర్గ సభ్యులు హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
డంప్ యార్డును తరలించాలని ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పటికే ఈ విషయంపై ప్రణవ్ తన దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్లు లీడర్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, కౌన్సిలర్లు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
