నేను బతికుండగా డంప్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌ పెట్టనివ్వను : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

నేను బతికుండగా డంప్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌ పెట్టనివ్వను : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్​రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తాను బతికుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ పెట్టనిచ్చే ప్రసక్తి లేదని, ఎంతవరకైనా పోరాడతానని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందన్నారు. 

ప్రజలు ముక్తకంఠంతో డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని, అసెంబ్లీ సాక్షిగా సీఎంకు దండం పెట్టి డంప్​ యార్డు వద్దని చెప్పానన్నారు. ‘కోపం ఉంటే నన్ను ఉరితీయండి.. జైలుకు పంపండి.. కానీ నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు’ అని అన్నారు. ఈ విషయంపై తాను సీఎంతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్​కు ఇప్పటికే లేఖలు రాసినట్టు వివరించారు.