ఖరీదైన విల్లాలకు కేరాఫ్​ అడ్రస్‌గా హైదరాబాద్

ఖరీదైన విల్లాలకు కేరాఫ్​ అడ్రస్‌గా హైదరాబాద్
  • అంబిషియస్ విల్లాలకు పెరిగిన డిమాండ్
  • పాన్ ఇండియా, ఎంఎన్‌సీల రాకతో పెరిగిన రేంజ్
  • రెండేళ్లుగా రూ.10 కోట్లు ఉండేవే నిర్మాణం 
  • శివారులో మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రతిపాదన


“ సిటీలో కొద్దిరోజుల కిందట  ఓ కంపెనీ రూ. 22 కోట్ల ఖరీదైన విల్లా ప్రాజెక్టుకు  ప్రకటన ఇచ్చింది. నెల తిరగకముందే అన్నీ బుక్​​ అయ్యాయి. అంబిషియస్ విల్లాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేది  తెలుస్తోంది. ముంబై, గుర్గావ్, ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో కనిపించే అంబిషియస్ లగ్జరీ విల్లాలు సిటీలోను వస్తుండడంతో  ప్రాజెక్ట్​ ఓపెనింగ్​కు ముందే కొనుగోలుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు.’’ 

హైదరాబాద్, వెలుగు: ఖరీదైన విల్లాలకు సిటీ హాట్ స్పాట్ గా మారింది. ఒకప్పుడు రూ. 5 కోట్ల విల్లా అంటేనే నోరెళ్లబెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రూ. 20 నుంచి 35 కోట్లవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న య్. పాన్ ఇండియా రియల్ ఎస్టేట్ కంపెనీలు, విదేశీ సంస్థల రాకతో  వీటి బిజినెస్ అమాంతంగా పెరిగింది. అన్ని సౌలతులు విల్లాలో కల్పిస్తుండగా డిమాండ్ ఉంటోంది. కొంతకాలంగా శివారుల్లో పదుల సంఖ్యలో విల్లాలు నిర్మిస్తుండగా సదుపాయాలు, సోషల్ ఇన్ ఫ్రాతో సంబంధం లేకుండా ప్రాజెక్టు తీరును బట్టి కొనేస్తున్నారు. ప్రస్తుతం రూ. 15 కోట్ల విల్లా బిజినెస్ హయ్యస్ట్. తాజాగా ఆ జాబితాలో రూ. 20–35 కోట్ల రేంజ్ లో విల్లాలను నిర్మించేందుకు బడా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.  తాజాగా అదేస్థాయిలో రూ. 25 నుంచి రూ. 35 కోట్ల రేంజ్ లో రెండు విల్లా ప్రాజెక్టులు శ్రీశైలం హైవే, బుద్వేల్ పరిసరాల్లో రావడం సిటీ మార్కెట్ పొటెన్షియాలిటీ రియల్ వర్గాలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రిమోట్ విలేజీల్లోనే నిర్మాణాలు 
అంబిషియస్ విల్లాలకు కేరాఫ్​గా గండిపేట్, కిస్మత్ పురా, మోకీలా, తెల్లాపూర్, మంచిరేవుల, కోకాపేట్, నెక్నాంపూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీప ప్రాంతాలు ఉన్నాయి. ఐటీ కారిడార్, ఎయిర్ పోర్టుకు చేరువలో ఉండే రిమోట్ విలేజీల్లోనే విల్లాలు వస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ నిర్మాణ సంస్థ ప్రతిపాదిత బుద్వేల్ ఐటీ పార్క్ పరిసరాల్లో ఒక్కో విల్లా అరె కరం విస్తీర్ణంతో 100కు పైగా నిర్మించేందుకు రెడీ అవుతోంది. రూ. 30 కోట్ల ఖరీదుతో 18వేల చదరపు అడుగుల భవంతిలో విలాసవంతంగా రూపొందించనుంది. శ్రీశైలం హైవేలోను రూ. 25 కోట్ల ఖరీదుతో 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే మరో మూడు విల్లాలు రానున్నాయి. విదేశీ కంపెనీల పెట్టుబడులతోనే  వీటి నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలిసింది. చుట్టూ గ్రీనరీ, ఇంటి పరిసరాల నుంచి బయటకు అడుగు పెట్టకుండానే అన్ని సౌలతులతో నిర్మిస్తున్నారు. 

అరెకరం విస్తీర్ణంలో విశాలంగా..
మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో గజం భూమి ధర రూ. 2 లక్షల పైనే ఉంది. ఫ్లాటు, ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 3–15 కోట్ల పైనే దొరుకుతాయి.  ఆ రేంజ్ ను దాటి శివారులో ఉండే గండిపేట్, కిస్మత్ పురా, తెల్లాపూర్, మోకీలా, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాల్లో  కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి. అరెకరం విస్తీర్ణంలో విశాలమైన విల్లాను నిర్మిస్తున్నారు. వీటి రేంజ్ కూడా బెంగళూరు, ముంబై తరహాలో రూ.10 కోట్ల నుంచి రూ.35 కోట్ల రేంజ్ లో ఉండే ప్రాజెక్టులు వస్తున్నాయి. స్టేటస్ కోసం ఇలాంటి విల్లాలను కొనేవారు కొందరైతే, కాంక్రీట్ జంగిల్ నుంచి ప్రశాంతమైన వాతావరణం ఆస్వాదించాలని కొనేవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో సిటీలో విల్లా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది.

పాన్​ ఇండియా, విదేశీ కంపెనీలు పెట్టుబడులు
సిటీ రియల్ మార్కెట్ గ్రోత్​తో పాటు ల్యాండ్ బ్యాంక్ వేల ఎకరా ల్లో ఉండగా పాన్ ఇండియా, విదేశీ కంపె నీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి.  బెంగళూరు, ఢిల్లీ, ముంబైకి చెందిన కంపెనీల రాకతో మార్కెట్ రేంజ్​ పెరిగింది. లోకల్ బడా బిల్డర్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో హైరైజ్ బిల్డింగులు నిర్మిస్తున్నారు. దేశంలోనే రియల్ ఎస్టేట్ కు సిటీ బిజినెస్ సెంటర్​గా మారింది. ఆఫర్డబుల్ విల్లా ప్రాజెక్టుల సంఖ్య  వందల్లోకి చేరగా, లగ్జరీయస్ విల్లా ప్రాజెక్టుల సంఖ్య పదికి పైనే ఉన్నాయి.

ఢిల్లీ, ముంబై రేట్లతో పోటీ 
సిటీలో విల్లా రేంజ్ ఐదారు కోట్ల నుంచి ఏకంగా ఢిల్లీ, ముంబై ల్లోని భవంతులతో పోటీ పడేలా హై రేంజ్ లో నిర్మిస్తున్నారు. నోయిడాలో  రూ. 50 కోట్లతో జంబో విల్లా నిర్మాణం  మూడేళ్ల కిందట జరిగింది. అంత కు మించి అన్నట్లుగా సిటీ లో నిర్మించేందు కు కంపెనీలు ముందుకొస్తున్నాయి.  భూముల ధరలు ఆయా సిటీల స్థాయిలో లేకున్నా..  నిర్మాణ శైలి, మెటీరియల్, మౌలిక వసతులు, గేటెడ్ కమ్యూనిటీలో కల్పించే ఫెసిలిటీస్ తో ఖరీదైన విల్లాలకు డెస్టినీగా మారుతుందని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా తర్వాత సేల్స్ పెరిగినయ్
ఒకప్పుడు ఐటీ జనాలు వీకెండ్ లో ఎంజాయ్ చేసేందుకు విల్లాలను కొనుగోలు చేసుకునే వారు. ఇప్పుడు ఇల్లు కొనాలంటే కనీసం ఆఫర్డబుల్ విల్లాలైనా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విల్లా సేల్స్ కూడా కరోనా తర్వాత 20 శాతంపైగా పెరిగాయి. నిర్మాణ అనుమతుల్లో వచ్చిన మార్పులు, భారీగా ల్యాండ్ బ్యాంక్ తో లగ్జరీయస్ ప్రాజెక్టుల సంఖ్య మరింత పెరిగింది. 
– రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్, జనరల్ సెక్రటరీ

సిటీలోనే డిమాండ్​ ఎక్కువ 
దేశంలోని అన్ని ప్రాంతా ల కంటే సిటీలోనే లగ్జరీ విల్లాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. వ్యాపా రవేత్తలు, సంపన్న వర్గాలతో పాటు, ఎన్ఆర్ఐలే లక్ష్యంగా ప్రాజెక్టులు అందు బాటులోకి వస్తున్నాయి. అంబిషియస్ విల్లాలతో దేశవ్యాప్తంగా సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మరింత డిమాండ్ ఏర్పడు తోంది. వచ్చే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీల కంటే లాభదాయకమైన విల్లాల నిర్మాణానికి బిల్డర్లు కూడా ఆసక్తి చూపుతారు. 
- చలపతిరావు, ట్రెడా ప్రెసిడెంట్