చెత్త డబ్బాలు లేని నగరంగా హైదరాబాద్

చెత్త డబ్బాలు లేని నగరంగా హైదరాబాద్

కరోనా వైరస్ ను అరిక్టడంలో స్వచ్ఛత చాలా అవసరమన్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా ఇవాళ(గురువారం) హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో  325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్వచ్ఛ వాహనాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. హైదరాబాదును చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను తీసుకుని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.

హైదరాబాదును స్వచ్ఛంగా ఉంచేందుకు GHMC పలు చర్యలు తీసుకుంటోంది. చెత్తను తరలించేందుకు 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. మొదటి విడతలో భాగంగా గురువారం 325 ఆటోలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ విజయలక్ష్మి, మంత్రి తలసాని తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

డ్రైవర్ కం ఓనర్ పద్దతిలో అందచేసిన ఈ స్వచ్ఛ ఆటోలకు 10 శాతం లబ్ధిదారుడు, 90 శాతం GHMC  భరించింది. ఇప్పటికి నగరంలో స్వచ ఆటోలు లేని ప్రాంతాల్లో ఈ ఆటోలు గార్బజ్ ను సేకరించనున్నాయి.ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో 2500  ఆటోలున్నాయి. ప్రతి రోజూ ఒక్కో స్వచ్ఛ ఆటో 6వందల ఇళ్ల నుండి చెత్త సేకరిస్తుంది. ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండడం తోపాటు ప్రమాదకర వ్యర్థలకు సపరేట్ బాక్స్ ఏర్పాటు చేశారు.