విరాట్ కోహ్లీ రీఎంట్రీ.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు తుది జట్టు ఇదే!

విరాట్ కోహ్లీ రీఎంట్రీ.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు తుది జట్టు ఇదే!

Virat Kohli In Team India ODI Squad: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, అలాగే ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు బీసీసీఐ (BCCI) ఈరోజు (ఆదివారం) టీమ్‌లను అనౌన్స్ చేసింది. ఈ వన్డే జట్టులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కోహ్లీ సిరీస్ ఆడటం అనేది ఒక ముఖ్యమైన కండిషన్‌పై ఆధారపడి ఉంది. అదేంటంటే.. అతను ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది.

బెంగళూరులో కోహ్లీ ఫిట్‌నెస్ టెస్ట్: 
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడాలంటే రేపు (సోమవారం) బెంగళూరులో జరిగే ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ కావాల్సి ఉంటుంది. ఈ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రోహిత్ శర్మ కూడా జట్టులో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు వికెట్ కీపర్లుగా సెలెక్ట్ అయ్యారు.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్: 
* జూలై 14 (ఎడ్జ్‌బాస్టన్)
* జూలై 16 (సోఫియా గార్డెన్స్) 
* జూలై 19 (లార్డ్స్)

ఇంగ్లాండ్ తో ఆడే టీమిండియా స్క్వాడ్: 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్‌నెస్‌ను బట్టి), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

►ALSO READ | పిచ్చ కొట్టుడు కొట్టిన జూనియర్స్.. వైభవ్ చెలరేగడంతో.. శ్రీలంక–A ముందు మైండ్ బ్లాకయ్యే టార్గెట్

ఐర్లాండ్ టి20 స్క్వాడ్‌లో మార్పు: 
ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఒక బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2026 లో ఎడమకాలి గాయంతో బాధపడిన మిస్టరీ స్పినర్ వరుణ్ చక్రవర్తి ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్ నుంచి తప్పించారు. అతని ప్లేస్‌లో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ ఐర్లాండ్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఐర్లాండ్ తో ఆడే టీమిండియా టీ20 జట్టు: 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.