కేంద్ర నిధులతోనే అభివృద్ధి..బీజేపీకి అంబర్పేట బలమైన అడ్డా

కేంద్ర నిధులతోనే అభివృద్ధి..బీజేపీకి అంబర్పేట బలమైన అడ్డా
  •     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అంబర్​పేట, వెలుగు: అంబర్​పేట ప్రజల వల్లే తాను రాజకీయంగా తలెత్తుకొని నిలబడగలిగానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి అంబర్​పేట బలమైన అడ్డాగా నిలిచిందన్నారు. ఆదివారం అంబర్పేట్‌‌‌‌‌‌‌‌లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆలే నరేంద్ర, దత్తాత్రేయ తర్వాత తనను కూడా ఇక్కడి ప్రజలు ఆదరించారన్నారు.

 కేంద్ర నిధులతో బస్తీ దవాఖానాలను అభివృద్ధి చేస్తున్నామని, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మెట్రో మొదటి దశకు కేంద్రం రూ.వేల కోట్లు ఇచ్చిందని, రెండో దశకు కూడా ఆమోదం తెలిపి 50 శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తనను తెలంగాణ నుంచి తరిమికొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు.