హైదరాబాద్‌లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. దారుణ హత్య

హైదరాబాద్‌లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ సిటీ శివార్లలో ఘోరం.. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను హత్య చేశారు దుండగులు. షాద్ నగర్ లోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా నరికి చంపారు. కమ్మరి కృష్ణను చంపిన తర్వాత.. అక్కడి నుంచి నిందితులు పరార్ అయ్యారు. 2024, జూలై 10వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు స్పాట్ కు చేరుకుని విచారణ చేస్తున్నారు.

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్  హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, ఫాంహౌస్ నిర్మాణాలు చేస్తూ కేకే గా గుర్తింపు  పొందారు. హత్య షాద్ నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన సొంత కె.కె ఫాంహౌస్ లో ఉండగానే.. నిందితులు రెక్కీ నిర్వహించి.. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం శంషాబాద్ లోని ట్రైడెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్తుండగా దారిలో కేకే మృతి చెందాడు. హత్యకు కారణాలు ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలా లేక ఆర్థిక లావాదేవీలా లేక వ్యక్తిగత వ్యవహారాల అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.