ఎంఎంసీ బిల్డింగ్ కు ప్లాన్ రూపొందించండి : కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

ఎంఎంసీ  బిల్డింగ్ కు  ప్లాన్ రూపొందించండి : కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి
  •     కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్ భగాయత్‌‌‌‌లో నిర్మించనున్న ఎంఎంసీ కొత్త బిల్డింగ్ పనులను ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శనివారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్‌‌‌‌లను సంప్రదించి భవన నిర్మాణ సమగ్ర ప్లాన్​ను రూపొందించాలని ఆదేశించారు. 

కార్యాలయ అవసరాలతోపాటు ప్రజల సౌకర్యం, పార్కింగ్, సమావేశ మందిరాలు, డిజిటల్ సేవల కేంద్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే, వాటర్ బోర్డు, హైడ్రా వంటి ప్రభుత్వ సంస్థలకు అవసరమైన కార్యాలయ స్థలాన్ని కూడా ముందుగానే గుర్తించి, అన్ని శాఖల సమన్వయంతో ఒక సమగ్ర పరిపాలనా కేంద్రంగా ఈ భవనాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.