మలక్ పేట: పెండ్లి విషయంలో వివాదం  ఉరేసుకొని కానిస్టేబుల్  ఆత్మహత్య

మలక్ పేట: పెండ్లి విషయంలో వివాదం  ఉరేసుకొని కానిస్టేబుల్  ఆత్మహత్య
  • కొద్ది నెలల కిందట నిశ్చితార్థం 
  • పెళ్లాడాల్సిన యువతిని ప్రేమిస్తున్నానంటూ మరో యువకుడి ఫోన్​ 
  • పెద్దల సమక్షంలో నిశ్చితార్థం రద్దు 
  • మళ్లీ ఇద్దరి మధ్య పెండ్లి ప్రస్తావన
  • సూసైడ్ ​చేసుకుంటున్నానని యువతికి ఫోన్​ 
  • పోలీసులు వెళ్లేలోపే కానిస్టేబుల్​ మృతి 
  • హైదరాబాద్​ మూసారాంబాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన 

మలక్ పేట, వెలుగు: హైదరాబాద్ ​మూసారాంబాగ్‌‌లోని శాలివాహన నగర్ పార్క్ సమీపంలో కానిస్టేబుల్ ముథే చంద్రశేఖర్ (35) ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 బ్యాచ్‌‌కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్.. అంబర్‌‌పేట ఎస్​సీఆర్​సీపీఎల్​పరిధిలోని మల్కాజిగిరి కమిషనరేట్‌‌లో రైటర్‌‌గా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోని బుధాఖుర్ద్‌‌. దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌లో కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతితో చంద్రశేఖర్‌‌కు కొద్ది నెలల కింద నిశ్చితార్థం జరిగింది. అయితే, ‘నువ్వు పెండ్లి చేసుకోబోయే అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం’ అని ఓ యువకుడు తరచూ ఫోన్​చేసి విసిగించాడు. దీని గురించి సదరు యువతితో మాట్లాడగా ఆమె కొట్టిపారేసింది.

ఈ విషయం రెండు కుటుంబాల వరకు వెళ్లడంతో కలిసి కూర్చుని మాట్లాడుకొని నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా సదరు యువతి, కానిస్టేబుల్​తరచూ ఫోన్​లో మాట్లాడుకుంటున్నారు. ‘నేను నిన్నే పెండ్లి చేసుకుంటా’ అని సదరు యువతి చెప్తూ వస్తోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి చంద్రశేఖర్ సదరు యువతికి వీడియో కాల్ చేసి చాలా సేపు మాట్లాడుకున్నారు. అంతలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చంద్రశేఖర్‌‌ చెప్పడంతో భయపడిన ఆమె వెంటనే చైతన్యపురి పోలీసులకు చెప్పింది. మలక్‌‌పేట పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది స్పాట్​ కు చేరుకునేసరికే ఉరేసుకుని కనిపించాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనపై మలక్‌‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.