విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు

విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు

హైదరాబాద్: విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శనివారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన అన్వల్ ఇన్వెస్టిటర్ సెలెబ్రేషన్స్ లో సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కష్టపడేతత్వాన్ని నేర్చుకోవాలని సూచించారు. పిల్లలకు చదువుతోపాటు విలువలు కూడా నేర్పించాలని చెప్పారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకోవడం గొప్ప అవకాశమన్నసీవీ ఆనంద్.. ఈ స్కూల్ లో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదగారని అన్నారు. స్కూల్ లో నిర్వహించే ప్రతి యాక్టివిటీలో విద్యార్థులు తప్పకుండా పాల్గొనాలని, అప్పుడే వారిలో ఉండే ప్రతిభా పాటవాలు బయటపడుతాయని తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే కోరిక ఉండేదన్న సీవీ ఆనంద్... ఇవాళ తాను ఓ పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు.