యూకే పార్లమెంట్ పురస్కారానికి హైదరాబాద్ డాక్టర్ ఎంపిక

యూకే పార్లమెంట్ పురస్కారానికి హైదరాబాద్ డాక్టర్ ఎంపిక

బషీర్ బాగ్, వెలుగు : యూకే పార్లమెంట్ అందించే అరుదైన పురస్కారం ‘ సేవా రత్న అవార్డు-– 2024’కు కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళాబంధు, ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి ఎంపికయ్యారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు అందించిన సేవలను గుర్తించి సిటీకి చెందిన ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. జూన్ 22న లండన్ పార్లమెంట్ వేదికగా హౌస్ ఆఫ్ లార్డ్స్ లో అరుదైన పురస్కారాన్ని ఆమె అందుకుంటారు. ఫౌండేషన్ ద్వారా ఆమె అందించే సేవలను సోషల్ మీడియా, ఎన్జీవోలు, టెలిఫోన్ సర్వేల ద్వారా గుర్తించిన లండన్ పార్లమెంట్ అనూహ్యారెడ్డిని అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది.