జలవిహార్ పేలుడులో ఒకరి మృతి.. ఇంకా విషమంగానే  మరొకరి పరిస్థితి.. ఒకరు డిశ్చార్జ్

 జలవిహార్ పేలుడులో ఒకరి మృతి.. ఇంకా విషమంగానే  మరొకరి పరిస్థితి.. ఒకరు డిశ్చార్జ్

ట్యాంక్ బండ్, వెలుగు:  నెక్లెస్ రోడ్​లోని జలవిహార్ ఆర్వో ప్లాంట్​లో జరిగిన పేలుడు ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో విజయనగరం జిల్లా పితలాపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ (52) సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఘటనలో గాయపడిన మరో ఇద్దరు అప్పలనాయుడు (45), అంజి (30)ని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పలనాయుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. స్వల్ప గాయాలైన అంజిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మృతుడు లక్ష్మణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.