హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, యూసఫ్ గూడ, షేక్ పేట్, గచ్చిబౌలి, ఆర్ సిపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవుల పల్లి, మణికొండ, గండిపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడ నీరు నిల్చిపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.