అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, నటుడు విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మరీచిక’. మే 29, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో అలరిస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తోంది. సస్పెన్స్‌తో నిండిన కథనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మాస్ట్రో ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్ ఆడియన్స్కు ఈ వీకెండ్ బెస్ట్ ఛాయిస్గా ‘మరీచిక’ నిలిచే ఛాన్స్ ఉంది.
#Mareechika (Telugu)
— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026
Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp
కథేంటంటే:
హైదరాబాద్లోని ఒక డిగ్రీ కాలేజీలో వెంకటలక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) చదువుతూ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే సంజయ్ (విరాజ్ అశ్విన్) ఒక కాఫీ షాప్ను నడుపుతుంటాడు. అమెరికా నుంచి వచ్చిన మరీచిక(రెజీనా)తో వెంకటలక్ష్మికి పరిచయమవుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన మరీచిక సిటీలోని తన ఆస్తులను అమ్మేసి తిరిగి అమెరికా వెళ్తుందని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. వెంకటలక్ష్మితోపాటు తన కాఫీ షాప్కి వచ్చిన మరీచికతో సంజూ మాటలు కలుపుతాడు. వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే అప్పటికే సంజూని ఎంతగానో ప్రేమిస్తోన్న వెంకటలక్ష్మీ వాళ్లిద్దరి ప్రేమను సహించలేకపోతుంది. ఇలా ఉండగా మరీచిక చెప్పిన మాటలన్నీ అసత్యాలని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. ఆ తర్వాత వెంకటలక్ష్మి ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
‘మరీచిక’ అంటే ఎండమావి, భ్రమలు అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ఒక పాత్రకు మరో పాత్రతో సంబంధం ఉంది అన్నట్టుగా ఒకసారి, అసలు అలాంటి వ్యక్తే లేరు అన్నట్టుగా మరోసారి చూపించిన విధానం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూడు పాత్రలు చెప్పే విషయాల్లో ఏది నిజం, ఏది కల్పితం అనే ట్విస్టులతో ఎమోషన్స్, మిస్టరీ అంశాలు సైకలాజికల్ థ్రిల్ ఫీలయ్యేలా చేస్తుంది. ఐడియా పరంగా మహేష్ బాబు ‘వన్: నేనొక్కడినే’ వైబ్స్ గుర్తుకు తెస్తుంది.
డైరెక్టర్ సతీష్ కాసెట్టి ఎంచుకున్న థాట్ బాగున్నా, కథనం లోనే అసలు ట్విస్ట్ పడింది. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కాస్త పేషెన్స్‌ను టెస్ట్ చేసేలా సాగుతుంది. లవ్ స్టోరీలో ఉండాల్సిన కెమిస్ట్రీ గానీ, ఎమోషన్ గానీ సరిగ్గా పండలేదు. అయితే, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా అసలైన ట్రాక్ ఎక్కుతుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్లో అజయ్ ఘోష్, రెజీనా, అనుపమల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా కాస్త నవ్విస్తూ, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మొత్తానికి ‘మరీచిక’ ఎంగేజ్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్.
