టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ డిఫెన్స్ కాలేజీలో ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..

టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్  డిఫెన్స్ కాలేజీలో ఉద్యోగాలు..  కొద్దిరోజులు ఛాన్స్..

సికింద్రాబాద్​లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్(సీడీఎం) గ్రూప్–-సి పరిధిలోని సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 8.

విభాగాల వారీగా ఖాళీలు: సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 1, కుక్ 2, మల్టీ– టాస్కింగ్ స్టాఫ్(ఆఫీస్ & ట్రైనింగ్) 5, స్టెనో గ్రేడ్–II 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. సివిలియన్ డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కుక్ పోస్టులకు సంబంధిత ట్రేడులో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.  

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 30. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ indianarmy.nic.inను సందర్శించండి.