మాస్టర్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో .. హైదరాబాద్‌‌ హీరోస్‌‌ గెలుపు

 మాస్టర్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో .. హైదరాబాద్‌‌ హీరోస్‌‌ గెలుపు

హైదరాబాద్‌‌: వెటరన్స్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ (వీసీఏటీ) ఆధ్వర్యంలో జరిగిన మాస్టర్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో హైదరాబాద్‌‌ హీరోస్‌‌ జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 38 రన్స్‌‌ తేడాతో రంగారెడ్డి రాయల్స్‌‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన హైదరాబాద్‌‌ హీరోస్‌‌ 10 ఓవర్లలో 157/5 స్కోరు చేసింది.

ఆర్‌‌ఎల్వీ ప్రసాద్‌‌ (63), అబ్దుల్‌‌ వాహీద్‌‌ (51) రాణించారు. తర్వాత రంగారెడ్డి 119/7 స్కోరుకే పరిమితమై ఓడింది. అబ్దుల్‌‌ వాహీద్‌‌ 3 వికెట్లతో రంగారెడ్డి ఇన్నింగ్స్‌‌ను కట్టడి చేశాడు. అర్వింద్‌‌ షెట్టికి ‘బెస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌’, రాంబాబు సర్లానాకు ‘బెస్ట్‌‌ బౌలర్‌‌’ అవార్డులు లభించాయి.