హైదరాబాద్, వెలుగు : సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్నిండు కుండలా మారింది. వరుస వానలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. అలుగు ద్వారా అధికారులు నీటిని కిందికి పంపిస్తున్నారు. వరద ఉద్ధృతిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24/7 పరిశీలిస్తున్నారు.
హుస్సేన్సాగర్ఫుల్ట్యాంక్లెవల్ 513.41 మీటర్లు కాగా, 513.53 మీటర్ల వరకు నీరు ఉంది. వరద పెరిగితే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.
