సిటీలో 523 లాగింగ్ పాయింట్స్...ఆ ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలి : హైడ్రా చీఫ్ రంగనాథ్

సిటీలో 523 లాగింగ్ పాయింట్స్...ఆ ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలి : హైడ్రా చీఫ్ రంగనాథ్
  • ముందస్తు జాగ్రత్తలతో మాన్సూన్​ ను సమస్యలు  ఎదుర్కొందామని పిలుపు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ముందస్తు జాగ్రత్తలతో మాన్సూన్ లో ఇబ్బందులు లేకుండా చూడవచ్చని హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్  ఏవీ రంగ‌‌నాథ్ అన్నారు. వ‌‌ర‌‌ద సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తే రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందుల‌‌ను పరిష్కరించవచ్చన్నారు. వ‌‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని  ట్రాఫిక్ పోలీస్‌‌, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఐఎండీ, టీజీడీపీఎస్‌‌, యూబీడీ, వాటర్ బోర్డు  తదితర శాఖ‌‌ల‌‌ అధికారులతో హైడ్రా ఆఫీసులో క‌‌మిష‌‌న‌‌ర్ రంగనాథ్​శుక్రవారం స‌‌మీక్ష సమావేశం నిర్వహించారు. వ‌‌ర‌‌ద కాలువ‌‌ల్లో డీసిల్టింగ్ ప‌‌నులు జ‌‌ర‌‌గాల‌‌ని, ఇందుకు హైడ్రా పూర్తి స‌‌హ‌‌కారం ఉంటుందన్నారు. జీహెచ్ ఎంసీ ప‌‌రిధిలో 523 వాట‌‌ర్ లాగింగ్ పాయింట్లలో105 వ‌‌ర‌‌కూ మేజ‌‌ర్‌‌, 157 మీడియం, 261 మైన‌‌ర్‌‌  ఉన్నాయ‌‌న్నారు. ఇక్కడ నీరు నిల‌‌వ‌‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలానికి ముందే రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించాలన్నారు. 

ఇందుకు గాను ఆయా శాఖ‌‌లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ఇబ్బందులంటే త‌‌మ దృష్టికి తీసుకురావాల‌‌న్నార. విరిగిపడే అవకాశం ఉన్న చెట్లను జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం ముందుగానే గుర్తించి పరిష్కరించాలన్నారు.  పోలీసు స్టేష‌‌న్‌‌కు అనుసంధానంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌‌లు అందుబాటులో ఉంచాల‌‌ని కోరారు. గ‌‌తేడాది న‌‌గ‌‌రంలో తలెత్తిన సమస్యలను హైడ్రా అడిష‌‌న‌‌ల్ డైరెక్టర్​వ‌‌ర్ల పాప‌‌య్య ప‌‌వ‌‌ర్ పాయింట్ ప్రజంటేషన్​ద్వారా వివ‌‌రించారు. ఖైర‌‌తాబాద్ జోన‌‌ల్ క‌‌మిష‌‌న‌‌ర్  సంతోష్, ట్రాఫిక్ జాయింట్ సీపీ  జోయెల్ డేవిస్‌‌, హైడ్రా అడిష‌‌న‌‌ల్ క‌‌మిష‌‌న‌‌ర్  ఆర్ సుదర్శన్​, హైడ్రా ఆర్ఎఎఫ్ వో జయప్రకాశ్ పాల్గొన్నారు.