న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అయిన హైదరాబాద్

 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అయిన హైదరాబాద్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ ముస్తాబైంది. కరోనా తో రెండేళ్లు దూరంగా ఉన్న జనం... ఈసారి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. స్పెషల్  డ్రంకెన్ డ్రైవ్ , ర్యాష్  డ్రైవింగ్ , ఓవర్  స్పీడింగ్ పై ఫోకస్ పెట్టారు.

 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్ సహా ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్స్ కు అనుమతి ఇచ్చారు. ఈవెంట్లను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోకి తెచ్చారు. డ్రగ్స్ పెడ్లర్లు, పాతనేరస్తులపై ఫోకస్ పెట్టారు. మఫ్టీ పోలీసులు, షీ టీమ్స్ తో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ డ్రంకన్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు.

 ఈవెంట్లలో సెలబ్రిటీల షో ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆర్గనైజర్లకు సూచించారు. ఏసీపీ స్థాయి అధికారులు స్థానిక పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీలోని పబ్ లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెలబ్రెటీలు, వీఐపీలు పాల్గొనే అవకాశాలు ఉండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సెలబ్రేషన్స్ జరిగే ఏరియాల్లో షీ టీమ్స్, పెట్రోలింగ్ పోలీసులతో నిఘా పెడ్తున్నారు. డీజేలను నిషేధించారు. సౌండ్ సిస్టమ్స్ రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేసే వారిని గుర్తించేలా ప్లాన్ చేశారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ పై ఫోకస్ పెట్టారు. 

మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 10గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ మీదకు నిషేధించారు. ఈ రూట్లలో ట్రావెల్ చేసే వాహనాలను డైవర్ట్ చేశారు. రాత్రి బేగంపేట్ ,లంగర్ హౌస్  ఫ్లై ఓవర్ మినహా మిగితా ఫ్లై ఓవర్లు క్లోజ్ చేస్తామన్నారు పోలీసులు. పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. ఎయిర్ టికెట్ చెక్ చేసి, వెహికిల్ డ్రైవర్లను బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేసి పర్మిషన్ ఇవ్వనున్నారు. 

స్పెషల్ డ్రంకెన్  డ్రైవ్ కోసం స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేశారు. పబ్స్, హోటల్స్ రూట్లలో స్టాటిక్ టీమ్స్ చెక్ పాయింట్స్ ఫిక్స్ చేశారు. డ్రంకన్ డ్రైవ్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో మొబైల్ టీంలతో రోమింగ్ ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్లలో కలిపి 190 స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ చెక్ పాయింట్స్ పెడుతున్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ర్యాండమ్ చెకింగ్ చేస్తారు. ఓవర్ స్పీడ్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో స్పీడ్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో క్యాబ్స్, డ్రైవర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న వారిని సొంత వెహికిల్ లో ట్రావెల్ చేయకుండా డ్రైవర్ లేదా క్యాబ్స్ లో తరలించాలని సూచించారు. 

మాదాపూర్ జోన్ లో 60 స్పెషల్ ఈవెంట్స్ కి పర్మిషన్ ఇచ్చామన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. ఈవెంట్స్ ఆర్గనైజర్స్ తో ఇప్పటికే మీటింగ్ జరిపామని తెలిపారు. ఈవెంట్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవన్నారు డీసీపీ శిల్పవల్లి. ఔట్ డోర్ లో జరిగే ఈవెంట్స్ కి డీజే పర్మిషన్ ఇవ్వట్లేదన్నారు డీసీపీ. న్యూ ఇయర్ వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని, ప్రమాదాలు జరక్కుండా చూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.