Telangana Global Summit : హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Telangana Global Summit : హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం అన్నారు కేంద్ర మంంత్రి కిషన్ రెడ్డి. బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ను బిల్డ్ చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం (డిసెంబర్ 08) భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ప్రసంగించారాయన. హైదరాబా కేవలం స్టేట్ క్యాపిటల్ కాదని.. ఇండియా ఎకానమీకి పిల్లర్ అని ఈ సందర్భంగా అన్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. కేంద్రం గోల్ వికసిత్ భారత్ అని.. అందులో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. అన్ని రాష్ట్రాలు పాత్రతోనే వికసిత్ భారత్ సాధ్య అవుతుందన్నారు. ఈ సమ్మిట్ కు  మోదీ ఇచ్చిన సందేశం ఇది అని తెలిపారు. 

హైదరాబాద్ ఐటీ, ఫార్మా లో టాప్ ప్లేస్ లో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఇండియా రెండో ప్లేస్ లో ఉందన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా కేంద్రం ముందుకెళ్తోందని అన్నారు. అందులో భాగంగా నేషనల్ హైవేలను 65 శాతం పెంచామని తెలిపారు. విమానాశ్రయాలను డబుల్ చేశామన్నారు. వెయ్యి కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మించామని.. గ్రీన్ ఫీల్డ్ హైవేలను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారు కిషన్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దేశాలను ఆకర్శిస్తుందన్నారు. హైదరాబాద్, తెలంగాణ గెలుపు భారత్ గెలుపు అని ఈ సందర్భంగా చెప్పారు.