- ఓఆర్ఆర్ రింగ్‌రోడ్డుపై రాకెట్వేగం అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
గండిపేట, వెలుగు: లైకులు, వ్యూస్ కోసం రోడ్లపై అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడపడమే కాకుండా.. ఆ వీడియోను ఫోన్లో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల తన వోక్స్వ్యాగన్ కారు కండిషన్‌ను టెస్ట్ చేయాలన్న ఆలోచనతో నార్సింగి టోల్ ప్లాజా నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ టోల్ ప్లాజా వైపు ఓఆర్ఆర్పై ఇతర వాహనదారులకు ముప్పు వాటిల్లేలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. రాకెట్ వేగంతో ప్రమాదకర డ్రైవింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు ఆదివారం నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.
