- కలెక్టర్ ప్రియాంక ఆల
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 12న నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక ఆల యువతకు సూచించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, అధికారులతో కలిసి ఆమె కలెక్టరేట్‌లోని తన చాంబర్ లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల12న మంగళవారం బంజారాహిల్స్ లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జిల్లా యువజన క్రీడల శాఖ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా ఉంటుందన్నారు.
ఇప్పటికే 10 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 120 ప్రైవేటు కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్ తో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
