ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, రంగారెడ్డి, నాగర్​ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటికి ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో యదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 8.15 సెం.మీ, రంగారెడ్డి జిల్లా కాసులాబాద్-లో 7.53 సెం.మీ వర్షపాతం రికార్డయ్యింది.