రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్: రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొందని, దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింద‌ని అధికారులు వెల్ల‌డించారు. వీటి ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండటంతో పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.