హైదరాబాద్ మెట్రోకి సమ్మె సెగ

హైదరాబాద్ మెట్రోకి సమ్మె సెగ

హైదరాబాద్ మెట్రోకి సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోస్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమీర్ పేట, మియాపూర్ మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని.. వేతనాలు పెంచమంటే పట్టించుకోవడం లేదని సమ్మె చేపట్టిన టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఐదేళ్లలో అన్ని ధరలు పెరిగినా తమకు జీతాలు మాత్రం పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వేతనం రూ.15 వేల నుండి రూ.18 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.