బుల్కాపూర్ వద్ద కుంగిన వాటర్లైన్.. రిపేర్లను పరిశీలించిన  వాటర్బోర్డు ఎండీ  

బుల్కాపూర్ వద్ద కుంగిన వాటర్లైన్.. రిపేర్లను పరిశీలించిన  వాటర్బోర్డు ఎండీ  

హైదరాబాద్​సిటీ/గండిపేట, వెలుగు: నగరంలోని బుల్కాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున వాటర్ బోర్డుకు చెందిన భారీ పైప్​లైన్ కుంగి ధ్వంసమైంది. సింగూరు నుంచి నీటిని సరఫరా చేసే 1200 ఎంఎం డయా మెయిన్ పైప్​లైన్ ఉదయం 5 గంటలకు ఒక్కసారిగా లీక్ అవ్వడంతో రిపేర్ పనులు మొదలయ్యాయి.

ఈ పనులను వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా తనిఖీ చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిపేర్ల కారణంగా మణికొండ, నార్సింగి, షేక్​పేట్, హకీంపేట్, టోలిచౌకీ, కాకతీయనగర్, మెహిదీపట్నం, ఆసిఫ్​నగర్, కార్వాన్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.