
హైదరాబాద్ ప్రజలను మరోసారి వరదలు బెంబెలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ చెరువుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు మరో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం ఉస్మాన్ సాగర్ బ్యారేజీ వద్ద 4 గేట్లు ఎత్తి 480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దాంతో హైదరాబాద్ మూసారాంబాగ్‌లో నీళ్లు వంతెనపైకి వచ్చి చేరాయి. అంబర్ పేట నుంచి మూసారాంబాగ్ వెళ్లే రూట్లో ఉన్న ఈ బ్రిడ్జిపైకి నీళ్లు రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.