జూబ్లీహిల్స్, వెలుగు: మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో మజ్లిస్ కీలక పాత్ర పోషించిందని, జూబ్లీహిల్స్మైనార్టీ ప్రజల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ప్రజాప్రభుత్వ సహకారంతో పరిష్కారిస్తానన్నారు.
