
హైదరాబాద్ : భార్యను కిరాతకంగా నరికి చంపాడు భర్త. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని అల్వాల్ లో జరిగింది. వెంకటాపురానికి చెందిన వెంకటేష్ ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్. భార్య దివ్వ హౌస్ వైఫ్. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు(5), చిన్నబ్బాయికి రెండు సంవత్సరాలుంటాయి. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవట. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరికీ మాటామాటా పెరగడంతో వెంకటేష్.. దివ్వను గొడ్డలితో నరికాడు. ఆమె మెడపై గొడ్డలి పోట్లు గట్టిగా తగలడంతో దివ్వ అక్కడికక్కడే చనిపోయింది.
తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేరం ఒప్పుకున్నాడు వెంకటేష్. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దివ్వ మృతిపై పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుపుతామన్నారు పోలీసులు.