హైదరాబాద్లో దారుణం... భార్యను చంపి.. భవనంపై నుంచి దూకిన భర్త..

హైదరాబాద్లో దారుణం... భార్యను చంపి.. భవనంపై నుంచి దూకిన భర్త..

హైదరాబాద్ నాగోల్ సాయి నగర్ లో దారుణం జరిగింది. భార్యను కత్తితో పొడిచి చంపి.. ఆ తర్వాత ఓ భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగోల్ సాయినగర్ లో రాజు, సంతోషి దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. వీరి స్వస్థలం అమనగల్ సమీపంలోని ఆకుతోటపల్లి. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదుగాని నిన్న(అక్టోబర్ 16) రాత్రి రాజు తన భర్యను దారుణంగా పొడిచి చంపేశాడు. 

ఆ తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన సోదరి ఇంటికి వెళ్లి.. పిల్లలను సోదరికి అప్పగించి తిరిగి ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. భవనం రెండవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.