
హైదరాబాద్, వెలుగు: సిటీ పోలీసులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. కరోనా కాలంలో బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్విస్ కేటగిరిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ సీపీ, ఎం.రమేశ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారని తెలిపారు. హెడ్ ఆఫ్ యూరఫ్ విల్హెమ్ జెజ్లర్ పేరుతో సీపీ, జాయింట్ సీపీకి శనివారం ఆన్లైన్లో సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్ అందజేశారు.