పట్టుబడిన 1000 వాహనాలను వేలం వేయనున్న పోలీసులు

పట్టుబడిన  1000  వాహనాలను వేలం వేయనున్న పోలీసులు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన, క్లెయిమ్ చేయని వాహనాలను వేలం వేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్స్‌లో 1000 పాడుబడ్డ, క్లెయిమ్ చేయని వాహనాలను  వేలం వేయనున్నట్లు ప్రకటించారు  కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. . 

అయితే ఈ వాహనాలపై అభ్యంతరం ఉన్న వాళ్లు కానీ, యజమానులు తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని  కోరారు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.  ఈ వాహనాలకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లోని అన్ని వివరాలు పొందుపరిచామని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న యజమానులు డాక్యుమెంట్లో నిర్ణీత గడువులోగా సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులను సంప్రదించాలని సూచించారు.

వాహనాలకు సంబంధించిన అదనపు సమాచారం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ విష్ణు దగ్గర అందుబాటులో ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు  మరిన్ని వివరాల కోసం +91 9490517317కు సంప్రదించవచ్చు లేదా సైబరాబాద్ పోలీసు అధికారిక వెబ్‌సైట్‌కి  లాగిన్ కావాలని చెప్పారు.